MBBS కోర్స్ చదవాలనే కోరిక ప్రతి విద్యార్థికి ఉంటుంది. MBBS చదవటం కొంచం కష్ట తరమే. ప్రస్తుతం ఒక్క  అమెరికాలోనే ఒక కోటి 40లక్షల మంది డాక్టర్ల అవసరం ఉంది .ప్రస్తుత పరిస్థితులలో, మన సమాజంలో డాక్టర్ కి మాత్రమే అత్యున్నత గౌరవం ఉంది.
ఇండియాలో MBBS విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇతర దేశాలలో తక్కువ ఖర్చులో డాక్టర్ కావాలనుకునే మీ  కోరిక నెరవేర్చుకోవచ్చు .

ప్రతి సంవత్సరం, వేలాది మంది భారతీయ వైద్య విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మంచి వైద్య సంస్థలో ప్రవేశం పొందటానికి ఇబ్బందులు ఎదురుకొంటున్నారు . కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షలను క్లియర్ చేయగలుగుతారు, మరికొందరు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఎంపికల కోసం చూస్తున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అడిగే అధిక డొనేషన్స్ ని చాలా మంది విద్యార్థులు భరించలేరు. ఇటువంటి పరిస్థితులలో భారతీయ విద్యార్థుల కోసం కొన్ని విదేశీ వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వివిధ దేశాల్లోని అనేక విశ్వవిద్యాలయాలు ఎంబిబిఎస్ మరియు ఇతర వైద్య సంబంధిత కోర్సులు అనువైన ధరలకు అందిస్తున్నాయి, ఇది ఖచ్చితంగా భారతీయ విశ్వవిద్యాలయాలలో కాదు.

MBBS కోర్స్  ఇతర  దేశాలలో  ఎందుకు  చదవాలి  ?
India లో మెడికల్ సీట్స్ తక్కువ ఉంటాయి, పైగా వీటికి  కాంపిటీషన్ ఎక్కువ. అంతే కాకుండా, ఇతర దేశాలతో  పోల్చుకుంటే మన దేశంలో MBBS పూర్తిచేయటం చాలా ఖర్చుతో కూడుకున్న విద్య. seat సంపాదించటమే గగనం  అవుతుంది .
ఒక విద్యార్ధి మెడిసిన్ కోర్స్ పూర్తి చేయాలంటే, ఇండియాలో కోటికి పైగా ఖర్చు అవుతుంది. అదే వేరే దేశాలలో  సుమారుగా 30-60 లక్షల్లో  పూర్తిచేసుకోవచ్చు .
ఈ కారణం చేతనే, India నుండి చాలా మంది విద్యార్థులు MBBS చదవటానికి ఇతర దేశాలకి మొగ్గు చూపుతారు.

అందుబాటు ఖర్చుతో  MBBS విద్యని అందిస్తున్న 5 దేశాలు మీ కోసం :

Ukraine(ఉక్రెయిన్):

Ukraine అనేది ఒక ఈస్టర్న్ యురోపియన్ country. Russia,Poland, Slovakia , Hungary- Ukraine సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి.
వైద్య రంగంలో రాణించాలనుకునే స్టూడెంట్స్ కి ఉక్రెయిన్ చాలా తక్కువ ఖర్చుతో కూడిన ట్యూషన్ ఫీజు, మంచి నాణ్యమైన విద్యను అందిస్తుంది. India నుండి 4000 మందికి పైగా విద్యార్థులు Ukraineలో MBBS చదువుతున్నారు.
ఉక్రెయిన్‌, భారతీయ విద్యార్థులకు వైద్య కళాశాలల కోసం సమర్థవంతమైన గమ్యం.
WHO, UNESCO మరియు Medical Counsil of India వంటి అంతరాష్ట్రీయ సంస్థల ద్వారా గుర్తింపు చేయబడ్డాయి.
ఉక్రెయిన్‌లో మెడిసిన్కి ప్రసిద్ధి చెందిన కాలేజీలు: Odessa National University, Bukovinian State Medical University మరియు Donetsk National Medical University.

Kyrgyzstan  :


India
నుండి ఎక్కువ మంది విద్యార్థులు kyrgyzstan లో mbbs చదవటానికి  ఉత్సాహం  చూపిస్తారు. ఇక్కడ  MBBS కేవలం 12-18 లక్షల వ్యయం లోనే  పూర్తి  చేయొచ్చు.

Kyrgyzstan విశ్వవిద్యాలయాలలో ఇచ్చిన వైద్య విద్య యొక్క నాణ్యత చాలా యూరోపియన్ పరిమాణాలతో పోల్చబడింది.MBBS కోర్సు యొక్క వ్యవధి 5 ​​సంవత్సరాలు, ఇది 2018 నుండి.

రష్యా, చైనా, జార్జియా, ఉక్రెయిన్ తదితర ప్రాంతాలతో పోలిస్తే కిర్గిజ్స్తాన్‌లో జీవన వ్యయం చాలా తక్కువ. ఇక్కడ వాతావరణం ఉత్తర భారతదేశంలోని శీతల నగరాలతో సమానంగా ఉంటుంది.ప్రధాన మతం ఇస్లాం.

Kyrgyzstan విశ్వవిద్యాలయాలు WHO, MCI, UNESCO మరియు అనేక ఇతర దేశాల మెడికల్ కౌన్సిల్స్‌తో, ప్రపంచంలోని ప్రధాన సంస్థలచే గుర్తించబడ్డాయి.

కిర్గిజ్స్తాన్ విశ్వవిద్యాలయాలలో Jalal Abad State University, International School of Medicine మరియు Kyrgyz Russian Slavic University ప్రసిద్ధమైనవి.

రష్యా (Russia) :

ప్రపంచ అగ్ర దేశాలలో Russia ఒకటి. Russia lo MBBS చదవటం అనేది ఒక గొప్ప అర్హతగా భావిస్తారు. ఎందుకంటె అత్యంత నాణ్యమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం రష్యా సొంతం . ఇక్కడ  mbbs సీట్ పొందటం చాలా తేలిక. ఎటువంటి ప్రవేశ  పరీక్షలు  ఉండవు .

Russiaలో అత్యంత తక్కువ ఖర్చులో విద్యార్థికి కావాల్సిన అన్ని సౌకర్యాలు పొందవచ్చు . ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చితే రష్యాలోని ఆరోగ్య మరియు విద్యా మంత్రిత్వ శాఖ అధిక రాయితీతో రుసుము చెల్లించడం వల్ల రష్యాలోని ఎంబిబిఎస్ అంతర్జాతీయ విద్యార్థులకు అందుబాటైన ఎంపిక.

గత దశాబ్దంలో రష్యాలో ఎంబిబిఎస్ కోసం ప్రయాణించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పదిరెట్లు పెరిగింది.రష్యాలో MBBS వ్యవధి 6 సంవత్సరాలు.

రష్యన్ వైద్య విశ్వవిద్యాలయాల డిగ్రీలను WHO, MCI మరియు UNESCO గుర్తించింది.

రష్యాలో Northern State University, Mordovia State University మరియు Siberian State Medical University వంటి కొన్ని మంచి వైద్య కళాశాలలు ఉన్నాయి. అన్ని విశ్వవిద్యాలయాలు రష్యా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు గా నమోదు చేయబడినవి .

Germany :

జర్మనీలోని ప్రఖ్యాత వైద్య సంస్థల కారణంగా అక్కడ MBBS చదవటం అంటే అత్యంత  నాణ్యమైన విద్యని అభ్యసించినట్లే .

ఇతర దేశాలతో పోలిస్తే జర్మనీలో జీవన వ్యయం కొంచెం ఎక్కువ. చాలా విద్యా సంస్థలు MBBS కోర్స్ ని విదేశీ స్టూడెంట్స్ ఫ్రీగా కూడా అందిస్తున్నాయి. అధ్యయన కాలంలో విద్యార్థులు 2 సంవత్సరాల పూర్తి చేసిన తరువాత మెడికల్ ప్రాక్టీస్ లేదా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడానికి అనుమతిస్తారు.

కోర్సు పూర్తయిన తరువాత విద్యార్థి జర్మనీలోనే ప్రాక్టీసు కొనసాగించవచ్చు లేదా తిరిగి భారతదేశానికి రావచ్చు. స్టూడెంట్స్ కి 6th సంవత్సరం సుమారుగా 30-35 లక్షలో paid internship లభిస్తుంది. అనేక వైద్య విశ్వవిద్యాలయాలు కనీసం 200 సంవత్సరాల అనుభవం ఉన్నవి.

జర్మనీలో ఎంబిబిఎస్ చదివిన తరువాత ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి . ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వర్క్-పర్మిట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జర్మనీలోని కొన్ని ప్రముఖ వైద్య విశ్వవిద్యాలయాలు University of Munster, Lubeck Medical University మరియు University of Witten. జర్మనీలో 36 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు 80,000 సీట్లకు పైగా ఉన్నాయి.

Philippines:

ఇతర  దేశాలలో  MBBS చదవాలి అనుకునే ఇండియన్ విద్యార్థులకు Philippines అనువైన దేశం. Philippines lo MBBS అత్యంత తక్కువ ఖర్చుతో , అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టం పద్దతిలో బోధించబడును.
ముఖ్యంగా మన దేశ విద్యార్థులకి, ఇంగ్లీష్  సెకండ్  లాంగ్వేజ్  అవటం  వలన  మన విద్యార్థులకి  అనుకూలంగా  ఉంటుంది .
సూమారుగా 20-30 లక్షల లోపే philippines నుండి MBBS విద్యని పూర్తి చేయొచ్చు. Philipines వాతావరణం  మనం దేశ విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది .
ఫిలిప్పీన్స్‌లోని వైద్య విశ్వవిద్యాలయాలు US విద్యా విధానాన్ని అనుసరిస్తాయి, USMLE పరీక్షలు వ్రాయాలనుకునే విద్యార్థులకు సహాయపడుతుంది.
ఫిలిప్పీన్స్‌లోని విశ్వవిద్యాలయాలను MCI మరియు WHO గుర్తించాయి.

Our Lady of Fatima University, AMA School of Medicine, మనీలా, మరియు University of Perpetual Help అక్కడి కొన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here